చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు

చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు

SAKSHITHA NEWS

బుల్కాపూర్, చిన్న శంకర్‌పల్లి వార్డులలో ఎన్నికల ప్రచారం: నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్


సాక్షిత శంకర్‌పల్లి:
దేశంలో, రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జ్ బీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలోని బుల్కాపూర్, చిన్న శంకర్‌పల్లి వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరు గ్యారంటీలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటువేసి రంజిత్ రెడ్డిని ఆదరించాలని భీమ్ భరత్ విజ్ఞప్తి చేశారు. అనంతరం భీమ్ భరత్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 6 గ్యారెంటీలను అమలు చేశారని కొనియడారు. రాబోయే పంద్రాగస్టు వరకు రైతులకు రెండు లక్షల మేరకు రుణమాఫీ చేస్తానని సిఎం రాష్ట్ర ప్రజలకు హమీ ఇచ్చిన విషయాన్ని భీమ్ భరత్ గుర్తు చేశారు.

చేవెళ్ల పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పిసిసి సెక్రెటరీ ఉదయమోహన్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రెటరీ, చేవెళ్ల అసెంబ్లీ కోఆర్డినేటర్ జ్యోత్స్న శివారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ప్రకాష్ గుప్త, ఐఎన్ టియుసి జనరల్ సెక్రటరీ శేరి అనంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నసీరుద్దీన్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకట్ రామిరెడ్డి, కౌన్సిలర్లు శ్రీనాథ్ గౌడ్, చంద్రమౌళి, లావణ్య శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మమ్మ రాంరెడ్డి, నూర్జా బేగం తౌఫిక్, శ్వేతా పాండురంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పెంటయ్య, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, శివ యాదవ్, మాజీ సర్పంచ్ శ్రీధర్, కాశెట్టి మోహన్, ప్రశాంత్ కుమార్, ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ ముదిరాజ్, మహబూబ్ హుస్సేన్, రాజు గౌడ్, యాదయ్య గౌడ్, ఎజాస్, సింగాపురం మాజీ ఎంపిటిసి రామ్ చందర్, శ్రీశైలం, రఘునందన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మాదిరెడ్డి సమ్మిరెడ్డి, ముప్పిడి వెంకట్ రెడ్డి, నారాల విజయపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీధర్ గౌడ్, మల్లికార్జున్, చేవెళ్ల బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు రమ్యా రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు నాగమణి, ప్రత్యూష, పుష్పమ్మ, సుశీల, మహమ్మద్ ఆలియా ఆఫీస్, అమృత, మరియు మున్సిపల్ మండల నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 05 03 at 6.37.31 PM

SAKSHITHA NEWS