SAKSHITHA NEWS

నిజామాబాద్ పార్లమెంటు కార్యకర్తల సమావేశంలో ఏఐసిసి ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, ప్రోటోకాల్ ఇన్ ఛార్జ్ వేణుగోపాల్, ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు

  • సమావేశానికి ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఇంచార్జ్ దీపా దాస్ ముంన్షి,టీపీసీసీ అధ్యక్షులు, మంత్రి జూపల్లి కృష్ణారావు
  • సమావేశంలో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్ లు, సీనియర్ నాయకులు.

టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్క్రోలింగ్ పాయింట్స్:

  • పదేళ్ల బిఆర్ఎస్ పాలన ..కాంగ్రెస్ ఏడాది పాలనపై చర్చకు సిద్దం
  • పదేళ్లు కార్యకర్తల కృషి వల్లే కాంగ్రెస్ పార్టీ
    అధికారంలోకి వచ్చింది
  • పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం పాలన కంటే పది రెట్ల అభివృద్ది కాంగ్రెస్ ఏడాదిలో పాలనలో జరిగింది
  • రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లు గెలవాలి
  • పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు
  • పోటీ చేసే అభ్యర్థులు పార్టీలో అందరినీ కలుపుకొని పోవాలి
  • పీసీసీ అవ్వడానికి 30 ఏళ్లు పట్టింది. కార్యకర్తలకు ఓపిక అవసరం
  • రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలుస్తాం. ఈ విషయంలో స్థానిక నేతల సహకారం అవసరం చాలా ఉంది
  • రైతులకు మాత్రమే రుణ మాఫీ జరగాలి
  • రాళ్లు రప్పల, సాగు చేయలేని భూములకు రైతు బంధు ఎందుకు?
  • 2 లక్షల రుణ మాఫీ కి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.
  • కొన్ని సాంకేతిక కారణాల వలన కొంత మందికి రుణ మాఫీ జరగడంలో జాప్యం జరిగింది
  • వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బిఆర్ఏస్ కనుమరుగు
  • బిఆర్ఏస్ లో కవిత వర్సెస్ కేటీఆర్
  • కవిత – కేటీఆర్ ఇష్యుతో హరీష్ రావు పని గోవిందా
  • 2014 కి ముందు కవిత ఆర్థిక స్థితిగతులు ఏంటి? సమాధానం చెప్పగలరా?
  • పదేళ్లలో కేసిఆర్ కుటుంబ రాష్ట్రాన్ని యదేచ్ఛగా దోచుకుంది
  • ఊహించినట్టుగానే కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది
  • చట్టం పరంగా కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం
  • ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసిన వాళ్లను ఎంతటి వాళ్ళైనా సరే వదిలే పెట్టే ప్రసక్తే లేదు
  • ఫాం హౌస్ లో పడుకున్న కేసిఆర్ కు ప్రతిపక్ష హొదా ఎందుకు?
  • డ్రామా రక్తి కట్టించడంలో కేటీఆర్ కి సాటిలేరు
  • కేసిఆర్ కుటుంబానికి డ్రామాలు వెన్నతో పెట్టిన విద్య
  • బిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ను అడ్డం పెట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
  • బిఆర్ఎస్ ఏడాదికి 5 వేల ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ నెలకు 5 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం
  • మతం పేరిట బీజేపీ 8 ఎమ్మెల్యే 8 ఎంపీ స్థానాలు గెలిచారు. కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు మాత్రం శూన్యం
  • బీజేపీ విధ్వంసానికి ఎదురొడ్డి రాహూల్ గాంధీ వెళుతున్నారు
  • కుల గణన జరగాలని రాహుల్ గాంధీ బలంగా పోరాడుతున్నారు
  • రాహుల్ గాంధీ నఫ్రత్ చోడో – భారత్ జోడో నినాదానికి సంఘీభావంగా నఫ్రత్ చోడో – నిజామాబాద్ జోడో
  • రాబోయే ఎన్నికల్లో సర్వేల ఆధారంగా టికెట్లు
  • 65 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రులు చేసిన అప్పు కంటే..పదేళ్లలో కేసిఆర్ 7 లక్షలకు పైగా కోట్ల అప్పు చేసిండు
  • రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి చేసే లక్ష్యంగా అందరం అహర్నిశలు కృషి చేయాల్సిన అవసరం ఉంది

SAKSHITHA NEWS