Newly built Sevalal Banjara Bhavan in Banjara Hills
సాక్షిత: బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కొమురం భీమ్ ఆదివాసీ భవన్ లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, CS సోమేశ్ కుమార్, MAUD స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ లతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కోట్లాది రూపాయల విలువైన భూమిని కేటాయించి ఒక్కో భవనాన్ని 22 కోట్ల రూపాయల తో ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 17 వ తేదీన ప్రారంభిస్తారని తెలిపారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ పేరు తో బంజారా భవన్, ఆదివాసీ ల హక్కుల కోసం పోరాడిన కొమరం భీమ్ పేరుతో ఆదివాసీ భవన్ ను నిర్మించడం జరిగిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. భవనాల ప్రారంభించిన అనంతరం NTR స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని, ఈ సభకు రాష్ట్రంలో ని గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.