జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కొల్లూరు డబల్ బెడ్ రూమ్ ప్రచారంలో పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి .
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లూరు డబల్ బెడ్ రూమ్ సముదాయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించుతున్న ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి , మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు సత్యనారాయణ రెడ్డి .
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గ్రేవియార్డ్(స్మశానవాటిక) లేకపోవడం అని ప్రజలు నాయకుల దృష్టికి తీసుకురాగా వారు వెంటనే స్పందించి తెలంగాణ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి తెలియజేసి వారి సమస్యను సత్వరమే పరిష్కారం దిశగా పనులు ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ మతాలను సమాన దృష్టితో చూస్తుందని దానిలో భాగంగా ఇక్కడ హిందూ,ముస్లిం,క్రిస్టియన్ వర్గాలకు సమాన గౌరవం ఇస్తూ అన్ని కులాల వారికి వేరువేరుగా స్మశానవాటికలు ఏర్పాటు చేస్తుందని అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని తెలపడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
