భక్తిశ్రద్ధలతో రుద్రహోమం, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లక్ష కుంకుమార్చన
సాక్షిత : నెల్లూరు నగరంలోని వి.ఆర్. సి మైదానం వేదికగా నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఉదయం.. విశేష రుద్రహోమం మరియు 108 దంపతులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. విఆర్ కళాశాల మైదానంలోని లక్ష దీపోత్సవం ప్రాంగణానికి చేరుకున్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించారు. అనంతరం యాగశాలలో వేద పడింతుల మంత్రోచ్ఛరణల మధ్య విశేష రుద్రహోమం నిర్వహించారు. అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో 108 దంపతులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లక్ష కుంకుమార్చన నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ సభ్యులు భాస్కర్ శర్మ, ప్రభాకర్‌రావు, గంధం సునీల్, విజయసారధి, టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
