ఖమ్మం టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి , కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు. కాంగ్రెస్ నేత మల్లు నందిని పరామర్శించారు. ఇటీవల రాంనారాయణ గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం విధితమే. సోమవారం ఖమ్మం బైపాస్ రోడ్డులోని రాంనారాయణ ఇంటికి కూనంనేని సాంబశివరావు, మల్లు నందిని వెళ్లి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జికేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, బుల్లెట్ బాబు, పసుపులేటి దేవేందర్, టియుడబ్ల్యూజి (ఐజెయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్యులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు వై. మాధవరావు, చెరుకుపల్లి శ్రీనివాస్, జనార్ధనాచారి, కళ్యాణ్, రమేష్ తదితరులు ఉన్నారు.
రాంనారాయణకు కూనంనేని , నందిని పరామర్శ
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…