నామ ముత్తయ్య ట్రస్ట్ నేతృత్వంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు
కార్మిక పక్షపాతి ఎంపీ నామ
దశాబ్ధకాలంగా ఆటో కార్మికులకు భారీగా ఖాకీ చొక్కాలు
అమ్మ పేరుతోనూ రెండేళ్లుగా ఆటో కార్మికులకు సేవలు
కార్మికుల కష్టాలెరిగిన నాయకుడు నామ
పేదల సేవే నామ ఏకైక లక్ష్యం
ఖమ్మం టేకులవల్లి అడ్డాలో 212 ఆటో కార్మికులకు ఖాకీ చొక్కాలు వంపిణీ కార్యక్ర మంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
కార్మికుల కష్ట సుఖాలు ఎరిగిన నాయ కుడు ఎంపీ నామ నాగేశ్వర రావు అని రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వ రరావు పేర్కొన్నారు. ఎంపీ నామ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఖమ్మం టేకులపల్లిలోని కేసీఆర్ టవర్స్ ఆటో కార్మికుల అడ్డాలో మంగళవారం నామ ముత్తయ్య ట్రస్ట్ నేతృత్వంలో 212 మంది ఆటో కార్మికులకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్య క్రమంలో నల్లమల మాట్లాడు తూ ఎంపీ నామ కార్మిక పక్ష పాతి అన్నారు. ఎంపీ నామ ఎప్పుడూ కార్మిక పక్షంగా ఉంటూ ఎప్పుడు ఏ కష్టమొ చ్చినా నేనున్నాంటూ వారిని ఆదుకుంటూ భరోసా కల్పించ డం ఆయన నైజమని అన్నారు. తన తండ్రి నామ ముత్తయ్య పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చరిత్ర నామాది అన్నారు. ప్రజా సేవలకు చిరు నామ నామ అన్నారు. సేవా కార్యక్రమాల్లో ఎంపీ నామ దిట్టా అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, పేదలకు, విద్యార్థులకు, మహిళలకు,ఇలా అందరికీ ఏ కష్టమొచ్చినా ట్రస్ట్ నుంచి సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. గత దశాబ్దానికి పైగానే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున ట్రస్ట్ నేతృత్వంలో ఆటో, హమాలీ కార్మికులకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేయడం ఆనవాయి తీగా వస్తుందని నల్లమల చెప్పారు. గత రెండేళ్లుగా వారి అమ్మగారు నామ వరలక్ష్మీ ‘అమ్మ’ పేరుతో విస్తృతంగా ఆటో కార్మికులకు ఖాకీ చొక్కాల పంపిణీ చేయడం జరుగు తుందని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో నామ ముత్తయ్య ట్రస్ట్ 1996 నుంచి క్రియా శీలక పాత్ర పోషిస్తూ ప్రజల జీవితాల్లో మమేకమవు తుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న ఎంపీ నామ గొప్ప మానవతావాదిగా అభివర్ణించారు. సమాజంలో యువతకు సమాన అవకా శాలు కల్పించడంలోనూ ఎంపీ నామ అగ్రభాగాన నిలిచారని అన్నారు. తను సంపాదించిన దానిలో ఎంతో కొంత పేద వర్గాలకు ఖర్చు చేస్తూ ఆద ర్శంగా నిలిచారని అన్నారు. పేదలను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీఎంఆర్ఎఫ్ పధకం ద్వారా భారీ ఎత్తున ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారని అన్నారు. ప్రతి వారం లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్న ఘనత నామ నాగేశ్వరరావుకు దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్
చెక్కులను పేద వర్గాలకు పంపిణీ చేసిన చరిత్ర నామాది అని నల్లమల పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చిలకల వెంకటనర్సయ్య యాదవ్, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, నాయకులు వాకదాని కోటేశ్వరరావు, టేకులపల్లి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల ఇన్చార్జి షేక్ రహీం, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్, భార్గవ్, టేకులపల్లి అడ్డా ఆటో వర్కర్స్ యూని యన్ అధ్యక్షులు పొదిల నాగరాజు, ఉపాధ్యక్షులు ఎండీ యాసిన్, ప్రధాన కార్యదర్శి కొర్రి రామారావు, కోశాధికారి వారా నాగరాజు, కమిటీ సభ్యులు పిల్లి రామకృష్ణ, పొదిల గోపి, వీరారెడ్డి, షఫీ, డుంగ్రోత్ గోపీ, కే.వినయ్, గుంటి శ్రీను, వైబీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.