నకరికంటి బాబు మృతి బాధాకరం. కుటుంబానికి 10,వేల రూపాయల ఆర్థిక సాయం…
బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజి యాదవ్..
సాక్షిత ప్రతినిధి అనంతగిరి :నకరికంటి బాబు మృతి బాధాకరం అనంతగిరి మండలంలోని మృతుని కుటుంబానికి బిజెపి రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజి యాదవ్ ఆదేశానుసారం ఆయన సోదరుడైన బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెబోయిన వెంకటేష్ బాబు మృతుని యొక్క కుటుంబాన్ని పరామర్శించి 10,వేల రూపాయలను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి పరామర్శించి అండగా ఉంటానని సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నకరికంటి సుందర్రావు, ఎల్లయ్య, మారుతి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
