ఫోక్స్ నిందితుడు బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని………… సిపిఎం ఆధ్వర్యంలో నిరసన

Sakshitha news

ఫోక్స్ నిందితుడు బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని………… సిపిఎం ఆధ్వర్యంలో నిరసన

సాక్షిత వనపర్తి:

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని వనపర్తి అంబేద్కర్ చౌక్ లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి ఎం. పరమేశ్వర చారి అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. డి. జబ్బార్ పాల్గొని మాట్లాడుతూ మైనరు బాలికపై మత్తుమందు తాపీ అనేక మార్లు అత్యాచారం చేసిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను ఫోక్సో కేసు నిందితుడు ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫోక్సో కేసు అయ్యి ఆరు రోజులైనా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు తాత్సరం చేస్తూ అతనికి ముందస్తు బెయిల్ వచ్చేదాకా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడా అని తీవ్రంగా ఖండించారు.

బాధితురాలిపై తప్పుడు కేసు పెట్టడాన్ని విమర్శించారు. బండి భగీరథ పరా రి ల్లో ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. మైనర్ పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ చేయడానికి, ఫోక్ సో కేసు నమోదు చేయడానికి కూడా రాష్ట్ర పోలీసులు మీనమేషాలు లెక్కించారన్నారు. ఫోక్సొలాంటి కఠినమైన కేసులో కూడా నిందితున్ని అరెస్టు చేయకుండా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు. బాధితురాలి పైనే పోలీస్ కేసు పెట్టడం దుర్మార్గం అన్నారు. బండి భగీరథును మైనరు బాలిక హనీ ట్రాప్ చేసిందన్నడం, డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నారనడం మహిళల పట్ల వారి వైఖరిని వారి దిగజారుడుతనాన్ని తెలియజేస్తుందన్నారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కేంద్రమంత్రి వర్గం నుంచి భర్తల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం 18 వ వార్డు కౌన్సిలర్ సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గంధం మదన్, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు డి.కురుమయ్య, జి.
బాలస్వామి, ఏ. రమేష్,గంధం గట్టయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంటి వెంకటయ్య,సిపిఎం రేమద్దుల సర్పంచ్ నిరంజన్, సిపిఎం నాయకులు నందిమల్ల రాములు, పీఎం జిల్లా ఆఫీస్ కార్యదర్శి ఉమా, డి. శ్రీనివాసులు, బి.కురుమయ్య, విజయ్ కుమార్,ఎం.మన్యం, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు

Scroll to Top