పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట, కేవలం పది రోజులు తిరగకుండానే నెరవేరింది..
మండలనేని చరణ్ తేజ
చిలకలూరిపేట: జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ , ఉప ముఖ్యమంత్రి ,పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ శారదా హై స్కూల్ విద్యార్థులకు కంప్యూటర్లు, లైబ్రరీ పుస్తకాలను అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శారదా హై స్కూల్ నందు మీడియాతో మాట్లాడుతూ”పేరెంట్స్ డే మీటింగ్ రోజున, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా విద్యార్థులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు కావాల్సిన కంప్యూటర్లు మరియు లైబ్రరీ పుస్తకాలను తన సొంత డబ్బులతో ఇప్పిస్తానని ఆ రోజు కళ్యాణ్ హామీ ఇచ్చారు,” అని చరణ్ తేజ తెలిపారు.పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట, కేవలం పది రోజులు తిరగకుండానే నెరవేరిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు , పంచాయితీ రాజ్ శాఖా కమిషనర్ కృష్ణ తేజ ఐఏఎస్, కలెక్టర్ కృతిక శుక్ల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందకరమని చరణ్ తేజ ఈ సందర్భంగా తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
