కోతులకుంటతండా ఏకగ్రీవ సర్పంచును సన్మానించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
కృతజ్ఞతలు తెలియజేసిన సర్పంచ్ చంద్రమ్మ పాండు నాయక్
సాక్షిత వనపర్తి
ఖిల్లా ఘణపురం మండలం కోతులకుంట తండా గ్రామపంచాయతీ సర్పంచుగా చంద్రమ్మ పండు నాయక్ ని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
ఈ సందర్భంగా ఏకగ్రీవ సర్పంచుగా ఎన్నికైన చంద్రమ్మ పాండు నాయక్ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు
గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి అభినందించారు
కోతులకుంట గ్రామపంచాయతీ అభివృద్ధికి తాను ఇచ్చిన మాట ప్రకారం రూ 20 లక్షల SDF నిధులను మంజూరు చేస్తానని గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు
సర్పంచ్ గా ఎన్నికైన మీరు ఎల్లవేళలా గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే వారికి సూచించారు
కార్యక్రమంలో ఖిల్లా ఘణపురం మండలం సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, డైరెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, మండల నాయకులు వెంకట్రావు , సాయి చరణ్ రెడ్డి , రవి నాయక్, రాములు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
