ఆపద సమయాల్లో యువత స్పందించాలి – నాగరాజు రెడ్డి

ఆపద సమయాల్లో యువత స్పందించాలి – నాగరాజు రెడ్డి

SAKSHITHA NEWS

నార్కట్ పల్లి (సాక్షిత ప్రతినిధి)

నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పుట్టినరోజు సందర్భంగా చిట్యాల మండలం బి ఆర్ ఎస్ పార్టీ యువజన సంఘం ఆధ్వర్యంలో నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తం దానం చేయడం జరిగింది. సందర్భంగా మండల యూత్ అధ్యక్షుడు తుమ్మల నాగరాజు రెడ్డి మాట్లాడుతూ యువత రహదారులపై వాహనాలు హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్త నడుపుతూ ప్రమాద వశాత్తు రోడ్డు ప్రమాదానికి లేదా ఇంకేదైనా అత్యవసరంలో వున్న వారికి వెంటనే యువత స్పందిస్తూ రక్తదానం చేసి వారికి ప్రాణదాతలు అవ్వాలని సందర్భంగా పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకుడు పాలెం మల్లేష్ గౌడ్, టిఆర్ఎస్ యూత్ మండల ప్రధాన కార్యదర్శి బొడిగ సాయికుమార్ గౌడ్, సింగిరెడ్డి గోపిరెడ్డి,దేవతల శివశంజు, నరేష్ రెడ్డి, బండ శివ, బండ సురేష్ ,చిత్రగంటి ప్రవీణ్, నమ్ముల అనిల్ గౌడ్, గోలి అరవింద్, కుమార్, శ్రీకాంత్, నకిరేకంటి స్వామి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 04 20 at 4.28.17 PM

SAKSHITHA NEWS