MURDER ప్రియురాలిని, ఆమే కుమారుడు ని హత్య చేయబోయిన ప్రియుడు,
సమాచారం తెలుసుకుని వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురు ప్రాణాలు కాపాడిన ఈపూరు ఎస్సి. ఫిరోజ్ ఖాన్.,
పల్నాడు జిల్లా
వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ లో సంఘటన. పరారి లో నిందితుడు శ్రీనివాసరావు ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ లో మహిళ ను ఆమే కుమారుడు ను గొంతు నులిమి చంపి పూడ్చి పెట్టబోయిన మహిళ ప్రియుడుతెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ కు చెందిన ఒక మహిళ నాలుగు సంవత్సరాల క్రితం తన భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో… కుమారుడు శివ తో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.
ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ కు చెందిన శ్రీనివాసరావు అనే యువకుడితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు సహజీవనం చేసారు ఈ క్రమంలో శైలజ గర్భందాల్చింది … శ్రీనివాసరావు శైలజ ను నరసరావుపేట కు తీసుకుని వచ్చి గది అద్దెకు తీసుకుని అక్కడ ఉంచాడు ఆసుపత్రిలో చూపించాలని శైలజ వత్తిడి చేయడంతో శైలజ ను ఆమే కుమారుడు శివ ను హత్య చేయాలని భావించి, ఈపూరు మండలం ముప్పాళ్ల సమిపంలో గుంత తీసి ఆ గుంత లో పాతి పెట్టాలని శ్రీనివాసరావు పన్నాగం పొందాడు పన్నాగం లో భాగంగా ఆసుపత్రిలో చూపించుకుందామని శైలజ ను ఆమే కుమారుడు శివ ను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ముప్పాళ్ళ సమిపంలో కాల్వకట్ట వద్ద తాను తీసిన గుంత వద్దకు తీసుకెలుతూ మార్గ మధ్యలో ఒక హోటల్ వద్ద మహిళ కుమారుడు ని ఇక్కడే ఉండమని చెప్పి కొంతదూరం వెళ్లిన తర్వాత శ్రీనివాసరావు శైలజ గొంతు నులిమి హత్య చేయబోయాడు శైలజ సృహతప్పి పడిపోయినట్లు నటించగానే… ఆమే కుమారుడు ని తీసుకురావడానికి శ్రీనివాసరావు హోటల్ వద్దకు వెళ్లడం తో… శైలజ వెంటనే లేచి సమిపంలోని పవర్ ప్లాంట్ వద్దకు చేరుకుని జరిగిన సంఘటన అక్కడ వారికి తెలపడంతో వారు ఈపూరు పోలిసులకు సమాచారం తెలియజేసారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని శైలజ ను ఆమే కుమారుడు ని కాపాడారుపోలిసుల రాకను గమనించిన శ్రీనివాసరావు పరారయ్యాడుఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వినుకొండ రూరల్ సీఐ ఉప్పుటూరి సుధాకర్ తెలిపారు.