SAKSHITHA NEWS

జన విజ్ఞాన వేదిక (JVV) సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్రపంచ జల దినోత్సవం-2024 వేడుకల” పోస్టర్ జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు తో కలిసి సూర్యాపేట కమీషనర్ శ్రీనివాస్ ఆవిష్కరించారు.

నీటి విలువ ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని జీవకోటికి నీరే ప్రాణాధారం అని ఆయన అన్నారు.

మార్చి 22న వరల్డ్ వాటర్ డే ను పురస్కరించుకొని “నీటి సంరక్షణ – మన బాధ్యత” అనే అంశంపై విద్యార్థులకు జిల్లా స్థాయి అవగాహన సదస్సును స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 22న సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు రమేష్ బాబు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 6 నుండి 9 తరగతుల విద్యార్థులకు నిర్వహించే పోటీల్లో భాగంగా
1) నీటి సంరక్షణ ప్రయోగాలు/ ప్రాజెక్టుల ప్రదర్శన,
2) నీటి పొదుపు, నీటి సంరక్షణ సంబంధిత డ్రాయింగ్ డిస్ప్లే పోటీలు,
3) పోస్టర్ ప్రెజెంటేషన్ తో పాటు
4) డాన్సులు, కళాత్మక స్కిట్స్ తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు జె. వి.వి. నాయకులు వల్ల పట్ల దయానంద్, తల్లాడ రామచంద్రయ్య, షేక్ జాఫర్, సోమ సురేష్ కుమార్ తెలిపారు.

WhatsApp Image 2024 03 21 at 6.06.25 PM

SAKSHITHA NEWS