శంకర్ పల్లి తై బజార్ చార్జీల వసూళ్లను ప్రకటించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్.
శంకర్ పల్లి; ఆగస్టు 3.
శంకర్ పల్లి మున్సిపాలిటీలో తై బజార్ వసూళ్ల ధరలను కమిషనర్ శ్రీనివాస్ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ సమక్షంలో శనివారం కూరగాయలు తదితర విక్రయదారులకు మున్సిపల్ కార్యాలయంలో తెలియజేశారు. అన్ని మున్సిపాలిటీల వలె శంకర్ పల్లి లో కూడా ప్రతిరోజు తై బజారు వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు.1. కూరగాయలు, చెప్పుల దుకాణాలు, మిఠాయి దుకాణాలు, మిర్చి, అల్లం వెల్లుల్లి గడ్డలు, నూనె దుకాణాలు, పండ్ల బండ్లు, మాంసం దుకాణాలు, మరియు ఇతరత్రా దుకాణాలకు రూపాయలు 20 చొప్పున వసూలు చేస్తారని తెలిపారు. కాగా4/6 ఫీట్ల షాపులకు రూపాయలు 20 నుండి 15 రూపాయల వరకు తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయించిందని చెప్పారు…2. బట్టల దుకాణాలకు రూపాయలు 30=00 చొప్పున వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు, ట్రాలీ ఆటోలు, లోడు బండ్లకు 60=00 రూపాయలు చొప్పున వసూలు చేస్తారని వివరించారు. డీసీఎం వాహనముకు రూపాయలు 100=00 వసూలు చేయడం జరుగుతుందన్నారు. ఇసుక ట్రాక్టర్లకు రూపాయలు 150=00 చేస్తారని తెలిపారు. ఇతరములకు రూపాయలు 200 =00వసూలు చేస్తారని తెలిపారు. ఒకటవ తేదీ ఆగస్టు నుండి 31.03.2025 బహిరంగ వేలం చేయడం జరిగిందని అప్పటివరకు ఈ ధరలు అమలులో ఉంటాయని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వ్యాపారస్తులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
Sakshitha News
Download App