SAKSHITHA NEWS

హైదరాబాద్ నగరంలో మరో బాలుడి కిడ్నాప్:ఆందోళనలో తల్లిదండ్రులు..!!

హైదరాబాద్:
హైదరాబాద్‌ మహా నగరంలో సాయంత్రం మరో కిడ్నాప్‌ కేసు నమోదు అయింది. హైదరాబాద్‌ మహా నగరంలోని జిల్లెలగూడలో టిల్లు అనే బాలుడు అదృశ్యం అయ్యాడు.

ట్యూషన్ కు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రు లు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సిసి ఫుటేజ్ లో గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని బైక్ పై తీసుకు వెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.

సాయంత్రం నాలుగు గంటలకు ఈ కిడ్నాప్‌ ఘట న చోటు చేసుకుంది. సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


SAKSHITHA NEWS