సాయి నగర్ బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌కు రూ.45 లక్షలు మంజూరు – కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన కోలన్ హన్మంత్ రెడ్డి
సాయి నగర్, బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో బాల బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి కృషితో ప్రభుత్వం రూ.45 లక్షలు మంజూరు చేసింది.
ఈ సందర్భంగా బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీ కమిటీ స్థలంలో కోలన్ హన్మంత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్‌రూమ్ కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ నివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
