శ్రీశ్రీశ్రీ కట్టమైసమ్మ, శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ, శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానం ||
జీడిమెట్ల గ్రామంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ కట్టమైసమ్మ, శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ, శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో 132 డివిజన్ మాజీ అధ్యక్షులు బెకు శ్రీనివాస్, విలేజ్ ఫిషరీస్ చైర్మన్ మైపాల్ రెడ్డి, బాలప్ప, చిల్కూరి మల్లేష్, మద్దూరి వీరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

