మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ప్రగతి నగర్‌లోని వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చౌరస్తా వద్ద ప్రగతి నగర్ (276) డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తాతిరెడ్డి) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జయంతి కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిలుగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, కేక్ కట్ చేసి ఆయన ప్రజాసేవలను, సంక్షేమ పాలనను స్మరించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
హన్మంతన్న మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని పేర్కొన్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఇలా సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమమే ధ్యేయంగా అనేక ప్రజాహిత పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారని అన్నారు.
వైఎస్సార్ ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసిన వైఎస్సార్ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
