వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
వైఎస్సార్ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ షాపూర్ నగర్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేదలు, రైతులు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ,ఆరోగ్యశ్రీ,108 ఉచిత అంబులెన్స్ సేవలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేతగా వైఎస్సార్ గుర్తింపు పొందారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాజీ కార్పొరేటర్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు, డివిజన్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ సభ్యులు, యువజన కాంగ్రెస్ సభ్యులు, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి విభాగం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
