హోంగార్డుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…
— ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:గోదావరిఖని, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్‌ను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హోంగార్డుల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా హోంగార్డులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని శ్రద్ధగా విన్న రాజ్ ఠాకూర్ సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ప్రజల భద్రత, సేవా కార్యక్రమాల్లో హోంగార్డులు ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారి సేవలను ప్రభుత్వం గుర్తిస్తోందని, హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
హోంగార్డుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఎల్లప్పుడూ సహకరిస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
