SAKSHITHA NEWS

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో ఎం.ఎస్. ఎస్.సాయిరాం పేరు నమోదు.

కళా వేదిక అమేజింగ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సంయుక్త నిర్వహణలో ప్రతిష్టాత్మకంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కన్వెన్షన్ హాలు నందు అక్టోబర్ 19,20 తేదీలలో నిర్వహించిన ప్రపంచ తెలుగు కళా జాతర కార్యక్రమంలో సంగీత సాహిత్యాలలో మంచి ప్రతిభను కనబరిచినందుకు అభినందిస్తూ తెలుగు సాహితీ కళారంగ చరిత్రలో 24 గంటల 24 నిమిషాలు నిర్విరామంగా నిర్వహించిన రికార్డుగా గుర్తించి అమేజింగ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్ తానా బుక్ ఆఫ్ రికార్డ్ ( తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ) బుక్ ఆఫ్ రికార్డులలో ఎం.ఎస్. ఎస్.సాయిరాం పేరును నమోదు చేస్తున్నట్లుగా ధ్రువీకరిస్తూ కళా వేదిక ఆధ్వర్యంలో కత్తిమండ ప్రతాప్ సి. ఐ. ఓ. కళావేదిక కార్యదర్శి డా. టి.పార్థసారథి, అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి చేతులు మీదుగా జ్ఞాపిక సర్టిఫికెట్ తో ఘనంగా సత్కరించడం జరిగినది అని ఒక ప్రకటనలో ఆయన తెలియజేశారు.

సాయిరాం పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. గతంలో ఈయన తెలుగు భాష సంరక్షణ కోసం సామాజిక స్పృహ కలిగించే అనేక రచనలు చేయడం జరిగినది.ఈ సందర్బంగా డాక్టర్. హారిక డాక్టర్ జయశ్రీ కరిష్మా ఆప్తాల్మిక్ ఆఫీసర్ వి వెంకట్రావు, పి.హెచ్.ఎన్. జానకిరామన్, సీనియర్ అసిస్టెంట్ ఆనంద్ కుమార్ సూపర్వైజర్స్ పి. వి.రత్నం,ఎం సతీష్,తదితరులు అభినందనలు తెలియజేశారు.


SAKSHITHA NEWS