SAKSHITHA NEWS

జగన్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రా!

మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కి దమ్ముంటే నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై ..మాట్లాడు.

ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకున్నది అందుకే: స్పీకర్‌

నాతవరం(అనకాపల్లి జిల్లా)

మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కి దమ్ముంటే నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని రాష్ట్ర శాసనసభ స్సీకర్‌ అయ్యన్నపాత్రుడు సూచించారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గొలుగొండపేట గ్రామంలో 68 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంది అసెంబ్లీకి వచ్చి సమస్యలను ప్రస్తావించడానికేనని, ఈ విషయాన్ని జగన్మోహన్‌రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు.


SAKSHITHA NEWS