వివోఏ ల సమస్యలను పరిష్కరించాలి – ఎంఎస్ పి

వివోఏ ల సమస్యలను పరిష్కరించాలి – ఎంఎస్ పి

SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండల కేంద్రంలో వివోఏల నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకున్న సందర్భంగా
వివో ఏ ల దీక్షకు మహాజన సోషలిస్టు పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి శంకర్, జిల్లా నాయకులు ఎరసాని గోపాల్ లు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
వివో ఏ లను గ్రామస్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని డిమాండ్ చేశారు.
వారికి కనీస వేతనము నెలకు 20,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది లక్షల సాధారణ భీమా ఆరోగ్య భీమా సౌకర్యాలు కల్పించాలని మేడి శంకర్ మాదిగ డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రం మొత్తంలో ఉన్న గ్రామస్థాయిలో మహిళలతో మమేకమై పనిచేస్తున్న వివోఏలు ఏకమై రాబోయే ఎలక్షన్ లో కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు లక్ష్మి పద్మ అలివేలు శోభ సత్తమ్మ మంగమ్మ యాదమ్మ వెంకన్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS