SAKSHITHA NEWS

సంపూర్ణ అంధత్వ నిర్ములనే ప్రభుత్వ లక్ష్యం – ఎంపీపీ సునీత వెంకటేష్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

సంపూర్ణ అంధత్వ నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ అన్నారు. చిట్యాల మండలం ఎలికట్టె గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు శిబిరాన్ని ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ భౌతికంగా చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు ప్రసాదించడానికి చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అన్నారు. మానవ శరీరం లో అన్నిటి కంటే కళ్ళు ప్రధానమని తెలిసి కూడా కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ శాశ్వతం గా చూపు కోల్పోతున్న లక్షలాది మంది ని చైతన్య పరిచి, ఆదుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుండి పుట్టినదే కంటి వెలుగు కార్యక్రమం అని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచం లోనే ఎక్కడా లేదన్నారు. బాధితులకు అక్కడికక్కడే కళ్ళ జోడు ను అందిచడమే కాకుండా అవసరమయ్యే వారికి అపరేషన్ లకు కూడా రికమండ్ చేసి, వాటిని కూడా సంబంధిత ఆసుపత్రి లలో చేయిస్తామని అన్నారు. చాలా మంది తమకు చూపు తక్కువ అయిందని తెలిసి కూడా , ఆసుపత్రి కి వెళ్ళడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని , వారి కోసమే కేసీఆర్ నేరుగా గ్రామాల్లోకి వెళ్లి శిబిరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారని అన్నారు.వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న కంటి వెలుగు ఉద్యమం లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం అని ఆమె అన్నారు. తెలంగాణ లో కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దేశం మొత్తానికి వెలుగు నిస్తుంది అని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉయ్యాల సత్తయ్య, స్థానిక ఎంపిటిసి గొలనుకొండ దశరథ, మండల వైద్యాధికారి డా.కిరణ్ కుమార్, కంటి వెలుగు వైద్యాధికారిణి డా. శ్రవంతి, అప్తమాలజిస్ట్ పద్మ, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు,
ఏ ఎన్ ఎం లు పద్మ, రిబ్సా, ఆశా వర్కర్లు, మరియు వార్డు సభ్యులు పలువురు బిఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS