SAKSHITHA NEWS

అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి సాయం చేయాలి – ఎంపీపీ

— ప్రాణం చాలా విలువైనది

— సిపిఆర్ కార్యక్రమం నిర్వహించిన వైద్యాధికారులు

చిట్యాల – సాక్షిత ప్రతినిధి

మనిషి ప్రాణం చాలా విలు వైందని ఆపద సమయాల్లో సహకారం అందించాలని కోరారు. చిట్యాల పట్టణ కేంద్రం లో గల ముప్ప మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో అంగన్వాడి కార్యకర్తలకు, రెవెన్యూ సిబ్బందికి, పంచాయతీ రాజ్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి సిపీఆర్ (గుండె తిరిగి కొట్టుకునేలా చేయడం) శిక్షణ కార్యక్రమాన్ని మండల వైద్యాధికారులు డా.జి.కిరణ్ కుమార్, డా.యు.నర్సింహ ల అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ సిపిఆర్ చేయు విధానాన్ని అందరూ నేర్చుకోవాలని, ఆపద సమయాల్లో ఎవరికైనా గుండె ఆగిపోతే సిపిఆర్ ద్వారా తిరిగి గుండె కొట్టుకునేలా చేయడం వల్ల వారికి పునర్జన్మ ప్రసాదించిన వాళ్లమవుతామని అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి సహాయపడి ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటి వైస్ ఛైర్మన్ కూరెళ్ల లింగస్వామి, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మందడి రామ దుర్గా రెడ్డి, మరియు వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS