ఉండి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
దర్శనానంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ..
ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయంపైఇ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 125 నుంచి 150 సీట్లలో కూటమి గెలుస్తుందన్నారు.
వైసీపీ మాత్రం 25 నుంచి 40 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు. స్వామి సన్నిధిలో అబద్దాలు మాట్లాడనని అన్నారు. జగన్ మాట నిజమవుతుందో లేక తన మాట నిజమవుతుందో జూన్ 4వ తేదీ తెలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మంచి రోజుల రావాలని ఆకాంక్షించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.