సమాజంలో నైతిక విలువలు పెంపొందించాలి……………… డీఎస్పీ శ్రీధర్ రెడ్డి……
సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా )మదీనా తుల్ ఉలూమ్ మదర్సా ఆధ్యాత్మిక చైతన్యానికి పునాదిగా నిలిచింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా మెంబర్.మౌలానా అబూ తాలిబ్ రహమాని..మదీనా తుల్ ఉలూమ్ మదర్సా.భారీ బహిరంగ సభకు కదం తొక్కిన ఆధ్యాత్మికవేత్తలు
చారిత్రాత్మకంగా నిలిచిపోనున్న మదీనా తుల్ ఉ లూమ్ మదర్స స్వర్ణోత్సవాలు.విద్యా సంస్థలు సమాజంలో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేయాలని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురంలో మదీనా తుల్ ఉలూం మదర్స స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో బాల్యం నుండే విజ్ఞానంతో పాటు సమాజం పై అవగాహన కల్పించాలన్నారు.
మదీనా తుల్.. ఉలూమ్ మదర్స చక్కని నడవడికతో కూడిన ఆధ్యాత్మిక సామాజిక విద్యను అందించి ఉభయ రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతలు పొందడం కోదాడకే గర్వకారణం అన్నారు. గత 50 ఏళ్లుగా మదర్ స ను స్థాపించి ఉచిత వసతితో విద్యను అందిస్తున్న పాఠశాల వ్యవస్థాపకులు అబ్దుల్ ఖాద్రి రాషాదీ, మౌలానా అహ్మద్ నద్వి లు అభినందనీయులన్నారు. మరో ముఖ్య అతిథి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా నంబర్ మౌలానా అబూ తాలిబ్ రహమానీ మాట్లాడుతూ కోదాడలో గత 50 ఏళ్లుగా ఆధ్యాత్మిక సామాజిక విద్యను అందిస్తూ విరాజిల్లుతున్న మదర్స ఆధ్యాత్మిక సామాజిక చైతన్యానికి పునాదిగా నిలిచిందని కొనియాడారు. సమాజంలో ధర్మరక్షణ ఆధ్యాత్మిక విద్యాసంస్థలతోనే జరుగుతుందన్నారు. లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక సంస్థలు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించి పరిపూర్ణమైన వ్యక్తులుగా తయారు చేయాలన్నారు. జాతీయ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు మదర్సాలో గత 50 ఏళ్లుగా వందలాది మంది విద్యార్థులు హఫీజ్ కోర్సులు పూర్తి చేయడం అభినందనీయమన్నారు .పేదల కోసమే విద్యాసంస్థను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేకుండా ధర్మరక్షణ కోసం సమాజ బాగు కోసం కృషి చేస్తున్న మౌలానా అబ్దుల్ ఖాదిర్ రషాది ఆదర్శప్రాయులన్నారు మదర్సాలో విద్య పూర్తి చేసిన విద్యార్థులు మదర్సా యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలన్నారు. ఈ సందర్భంగా ఖురాన్ లోని సమాజ హిత అంశాలను ఆయన ప్రస్తావించారు గత రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వర్ణోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు, పూర్వ విద్యార్థులు భారీగా తరలివచ్చారు. మదర్సా మైదానం మొత్తం జనంతో కిటకిటలాడింది అర్ధరాత్రి వరకు ఆధ్యాత్మిక ప్రసంగాలు అల్లాను కీర్తిస్తూ పాడిన స్తోత్రాలు సబికుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాయి నిర్వాహకులు అహ్మద్ మౌలానా నదివి మాట్లాడుతూ మదర్సా స్వర్ణోత్సవాలు కోదాడలో చారిత్రాత్మకంగా నిలిచిపోతాయి అన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి అన్నదానం నిర్వహించారు.