SAKSHITHA NEWS

MOM అమ్మ మాట అంగన్వాడీ బాట
అంగన్వాడీ టీచర్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి

సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ అంగన్వాడీ కేంద్రం లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది

కౌన్సిలర్ మాట్లాడుతూ కార్యక్రమ ఉద్దేశం నేడు స్థానికంగా ప్రైవేట్ గా ప్లే స్కూల్ ఏర్పాటు చేసి అధిక ఫీజులు వాసులు చేసి పట్టి పీడిస్తున్న కమర్షియల్ విద్యా వ్యవస్థ గురి కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న అంగన్వాడి సెంటర్లకు (బాల్ బడి) పంపించడం వల్ల నైపుణ్యం గల టీచర్లు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్న పౌష్టికాహారం వినియోగించుకోని మహిళలు (గర్భిణీస్త్రీలు,బాలింతలు) బాలబాలికలు తీసుకోవడం వలన ఆరోగ్య భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించడం జరిగింది మరియు నూతనంగా చేరిన పిల్లలకు అన్నప్రాసన అక్షరాబ్యాసం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రభావతి,శ్రీధర్ అంగన్వాడీ సూపర్ వైసర్ కే రేణుక టీచర్స్ కే సరిత, డి లలితబాయి తదితరులు పాల్గొన్నారు

MOM

SAKSHITHA NEWS