బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన మోహన్ బాబు
సినీ నటుడు మోహన్ బాబు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మెహన్ బాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. తన వయసు 78ఏళ్లని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.