పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీప్రారంభించారు. హౌరా మైదాన్-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న నది కింద ఈ టన్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌కతాలో రవాణా వ్యవస్థ సులభతరం కానున్నది. ఈ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ తొలిసారి ఈ మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్ల వ్యయంతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా పిలుస్తున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ మార్గం కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్ లేక్‌లను కలుపుతుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా అందులో మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి.
అండర్‌వాటర్ మెట్రోతో పాటు కవి సుభాష్- హేమంత ముఖోపాధ్యాయ మెట్రో స్టేషన్, తరతాలా-మజేర్‌హట్ మెట్రో సెక్షన్‌ను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. అదేవిధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు