ఆధునిక పద్దతులను అవలంబించాలి
-ఆయిల్ పామ్ తోటల విస్తరణ మహోత్సవం
సాక్షిత రాజానగరం,:
రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో గల ఓం శివ శక్తి పీఠం కళ్యాణ మండపం నందు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ మరియు ఉద్యాన శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ తోటల విస్తరణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజం నగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ సతీమణి, జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ వెంకటలక్ష్మి హాజరయ్యారు. రైతులకు పామ్ ఆయిల్ మొక్కలను అందజేశారు.రైతులు పంట సాగు చేయడానికి ఆధునిక యంత్రాలు మరియు పరికరాల పట్ల అవగాహన కల్పించేందుకు పరికరాలు, యంత్రాలు ప్రదర్శన ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల సాగులో కాలానుగుణంగా ఆధునిక పద్దతులను అవలంబిస్తూ ఆధునిక పరికరాల ద్వారా అధిక దిగుబడిని పొందాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వంలో ఆయిల్ పామ్ తోటల రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులు సమస్యలు త్వరలోనే తీరేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..