ఖమ్మం వరద బాధితుల నిర్వాసిత ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం.
ఖమ్మంలో ఇటీవల వరదల కారణంగా మున్నేరు వాగు ముక్కుకి గురైన వరద బాధితులకు సుమారు 150 మందికి నిత్యవసర వస్తువుల నయాబజార్ స్కూల్ నందు పంపిణీ చేయడం జరిగింది . అనంతరం తడిసి ముద్దయిన స్కూల్ రికార్డులను , పరిజ్ఞాన పరికరాలను పరిశీలించారు . బొక్కలగడ్డ , రాజీవ గృహకల్ప ప్రాంతాలలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వానికి విన్నవిస్తానని అన్నారు . ప్రొఫెసర్ కోదండరాం నిర్వాసితుల తరఫున వచ్చిన సమస్యలను పరిశీలించి లోకల్ కమిషనర్ ఇచ్చే 16,500 కాకుండా అదనంగా నష్టపోయిన వారికి మానవతా దృక్పథంతో మరోరకంగా వారికి సహాయపడాలని ఖమ్మం కమిషనర్ కు సూచించడం జరిగినది . ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు , ఖమ్మం జిల్లా కన్వీనర్ వి.బాబు , హైదరాబాద్ నగర అధ్యక్షుడు నరసయ్య , మల్లెల రామనాథం , హనుమంత రెడ్డి , జావీద్ , వెంకటేశ్వర్లు , ఖమ్మం జిల్లా నాయకులు జె రవి , సర్దార్ , ఎల్ నరసింహారావు , వి మోహన్ , బి గణేష్ , రాజేందర్ , నాగేందర్రావు , టిఎన్జీవోస్ నాయకులు రంగరాజు తదితరులు పాల్గొన్నారు