MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీ విధించనున్నారు.ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు మళ్లీ కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయితే, సీబీఐ ఐదు రోజుల నిర్బంధాన్ని కోరగా, కోర్టు కేవలం మూడు రోజుల నిర్బంధాన్ని మాత్రమే మంజూరు చేసింది. త్వరలో కవితను రౌస్ స్ట్రీట్ కోర్టు నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయానికి అధికారులు బదిలీ చేయనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు కవితను సీబీఐ విచారించనుంది. లిక్కర్ కేసు, 100 కోట్ల విరాళం కేసు, సౌత్ గ్రూప్ కేసు, భూముల కేసుల్లో కవిత పాత్రపై సీబీఐ ప్రశ్నించనుంది.