SAKSHITHA NEWS

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ అంగన్వాడి, పాఠశాల బలోపేతానికి నిధులు కోటి ఎనిమిది లక్షలు మంజూరు


సాక్షిత వనపర్తి
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేకత చొరవతో వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 25 అంగన్వాడి కేంద్రాలకు, 23 ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రూపాయలు 1 కోటి 8 లక్షల 50 వేలు మంజూరయ్యాయి.

అంగన్వాడి కేంద్రాలలో, పాఠశాలలో నెలకొన్న వివిధ అత్యవసర సమస్యలను పరిష్కరించుకునేందుకు ఒక్కో అంగన్వాడి కేంద్రానికి 2 లక్షల 50 వేలు, పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి గాను ఒక్కో పాఠశాలకు 2 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు,

St sc bc మైనారిటీ గురుకులాల తో పాటు అన్ని వసతులుహాలలో ఉండే విద్యార్థులందరికీ మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను 40 శాతం పెంచి విద్యార్థుల ఇబ్బందులను దూరం చేసిందని ఆయన అన్నారు

రానున్న కాలంలో ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేయడంతో పాటు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలను నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టిందని వీటిని నిర్మాణంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే ప్రతి ఒక్కరికి ఉన్నతమైన విద్యాబోధన జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app