SAKSHITHA NEWS

పదవి విరమణ చేసిన పరదేశి రాములు ని సన్మానించిన

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
సాక్షిత వనపర్తి

జడ్చర్ల మండలం మాచర్ల గ్రామంలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన పరదేశి రాములు కళావతి లని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సన్మానించడం జరిగింది
తన సహచర ఉపాధ్యాయ బృందం, బంధుమిత్రులు కూడా రాములు ని ఘనంగా సన్మానించడం జరిగింది .

  • ఈ సందర్భంగాచిన్నారెడ్డి మాట్లాడుతూ*

అన్ని ఉద్యోగాల కెల్లా ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని అన్నారు.
నేటి బాలలను అక్షరాసులుగా తీర్చిదిద్ది సమాజంలో వివిధ ఉద్యోగాలలో స్థిరపడటానికి సరైన ఉపాధ్యాయుడే కారణం అవుతారు కావున విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవించాలని అన్నారు.
పెద్దలు మాతా, పితా, గురువు, దైవం అని అంటారు కదా మన తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని గురువుకు మాత్రమే ఇచ్చారని అలాంటి గురువును గౌరవించుకోవాలని అన్నారు.
ఉపాధ్యాయ వృత్తిలో రాములు క్రమశిక్షణతో ,స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలను పొందిరనిన్నారు.
పదవి విరమణ అనేది అనివార్యమని ప్రతి ఒక్కరు పదవి విరమణ పొందవలసి వస్తుందని అన్నారు.
రాములు భావి జీవితం సుఖ శాంతులతో ,ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.

కార్యక్రమంలో వనపర్తి జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దేవన్న యాదవ్, పి యాదగిరి మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు పి సతీష్ కుమార్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కిష్టారెడ్డి గ్రామ ప్రజలు మరియు బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app