బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
సాక్షిత వనపర్తి
వనపర్తి పట్టణంలోని 6 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త గా కొనసాగుతున్న పొనకంటి కృష్ణయ్య అనారోగ్యంతో రాత్రి మృతి చెందారు
విషయం తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శుక్రవారం ఉదయం బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా కృష్ణయ్య మృతి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు
కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ, మాజీ కౌన్సిలర్లు విభూది నారాయణ, బ్రహ్మం చారి, చీర్ల సత్యం సాగర్, నక్క రాములు, వనపర్తి నియోజక వర్గ సమన్వయ కర్త లక్కాకుల సతీష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
