వార్డ్ మెంబర్ కు కూడా గెలిచే అవకాశం ఇవ్వదు
ఎమ్మెల్యే మేఘారెడ్డి_
సాక్షిత వనపర్తి
రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలలో ప్రతిపక్షాలకు వార్డు సభ్యుడు గెలిచేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా మనం కష్టపడాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు
పెద్దమందడి మండల కేంద్రం నుంచి రాకేష్, తన్వీర్ యువకుల ఆధ్వర్యంలో దాదాపు 40 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల BRS పాలనలో యువకుల భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారిందని ప్రతి నిరుద్యోగి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు
నేడు ఇందిరమ్మ రాజ్యంలో యువకులకు ఉద్యోగ కల్పన, నోటిఫికేషన్లు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేక చర్యలు చేపట్టిన నివాళులు పేర్కొన్నారు
కాంగ్రెస్ పథకాలు వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు నచ్చితాము బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలిపారు
కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సత్య రెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, జిల్లా యూత్ అధ్యక్షులు వారికి ఆదిత్య, టైలర్ రవి రియాజ్ ,రాఘవేందర్ , రామాంజనేయులు బుచ్చన్న, వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
