చంటి బాలకృష్ణ పార్తివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి
మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ
…..
సాక్షిత వనపర్తి:
వనపర్తి పట్టణం రాయగడ వీధికి చెందిన చంటి బాలకృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలోగాయపడి హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు శుక్రవారం ఉదయంమృతదేహాన్ని ఒకటో వార్డు రాయగడ లోని మృతుడి నివాసానికి తరలించారు అదే వాడుకు చెందిన మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు చుక్క రాజు ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుడికీ ముగ్గురు కుమారులు ఉన్నారని వారని కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా బాలకృష్ణ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ లక్కాకుల సతీష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏర్పుల వెంకటయ్య యాదవ్ ఒకటో వార్డు కాంగ్రెస్ నాయకులు వంశముని మోహన్ జేటి సురేష్ ఆర్ టి కిరణ్ మండ్ల యాది మహేష్ తదితరులు ఉన్నారు.