SAKSHITHA NEWS

MLA మారుమూల గ్రామాలకు సైతం సంచార పశు ఆరోగ్య సేవా వైద్య సేవలను అందించాలి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

పాడి రైతుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది…

గుడివాడ పురపాల సంఘ ప్రాంగణంలోని సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాము.

వాహనంలో ఉన్న ప్రత్యేకతలను వివరించిన పశుసంవర్ధక శాఖ వైద్యులు….

గుడివాడలో ఉండాల్సిన…. సంచార పశు ఆరోగ్య సేవ వాహనం – 2ను నందివాడ మండలంలో స్టార్టింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారని…. ఎమ్మెల్యే రాము తెలిపిన అధికారులు.

ప్రాధాన్యత దృష్ట్యా ఒక వాహనాన్ని గుడ్లవల్లేరు మండలంలో స్టార్టింగ్ పాయింట్ ఏర్పాటు చేశామన్న అధికారులు.

నందివాడ మండలంలో పాయింట్ ఏర్పాటు చేస్తే అనేకమంది రైతు పాడి రైతులకు వైద్య సేవలను సకాలంలో అందించలేమన్న అధికారులు.

వైద్యుల వినతితో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే రాము…… గుడివాడలో స్టార్టింగ్ పాయింట్ కు అంగీకరించిన డైరెక్టర్.

నిర్లక్ష్యానికి తావు లేకుండా పాడి రైతులకు సంచార పశు ఆరోగ్య వాహన సేవలు అందించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే రాము.

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కామెంట్స్

గుడివాడలో వాహన స్టార్టింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తే… నందివాడ మండలంతో పాటుగా, గుడివాడ మరియు రూరల్ ప్రాంత పాడి రైతులకు కూడా అందుబాటులో ఉంటుంది.

రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో వాహన సేవలు అందేలా చర్యలు తీసుకున్నాం.

పాడి రైతుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గుడివాడ నియోజకవర్గంలో పాడి రైతుల శ్రేయస్సుకు కృషి చేస్తాను.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, పశుసంవర్ధక శాఖ ఏడి నరసింహారావు, పశుసంవర్ధక శాఖ వైద్యులు డాక్టర్ హెచ్ జయంత్, డాక్టర్ లత శ్రీ, మున్సిపల్ కమిషనర్ సుబ్రహ్మణ్యం పలువురు పాడి రైతులు పాల్గొన్నారు.

MLA

SAKSHITHA NEWS