SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లలో అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష…
ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు వేగంగా పూర్తి చేయాలి…
చేపట్టే పనులకు వ్యయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి జంట సర్కిళ్ల పరిధిలో ఉన్న ఎనిమిది డివిజన్ లలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులు మరియు జరుగుతున్న పనులపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, టౌన్ ప్లానింగ్, లా అండ్ ఆర్డర్ విభాగాల అధికారులతో కలిసి పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా డివిజన్లలో చేపడుతున్న సీసీ రోడ్లు, మంచినీటి పైపు లైన్లు, భూగర్భ డ్రైనేజీ, స్మశాన వాటికలు, వర్షపు నీటి నాలాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటిని వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ఇటీవలే కురిసిన వర్షాలకు ముంపు ప్రాంతాల్లో వరద నీటితో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అటువంటి ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అదే విధంగా ‘ప్రగతి యాత్ర‘లో ప్రతి రోజు పర్యటిస్తున్న నేపథ్యంలో తన దృష్టికి ప్రజలు తీసుకువస్తున్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి వహించి ప్రతిపాదనలు సిద్ధం చేసి తన దృష్టికి తీసుకురావాలని అందుకు అవసరమయ్యే నిధులు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి మంజూరు చేసేలా కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో డిసిలు ప్రశాంతి, మంగతాయారు, ఈఈలు కృష్ణ చైతన్య, గోవర్ధన్ గౌడ్, డిఈఈలు శిరీష, రూపాదేవి, పాపమ్మ, భాను చందర్, డిజీఎంలు విష్ణు ప్రసాద్, అప్పల నాయుడు, రాజేష్, టౌన్ ప్లానింగ్ డీసీపీ సాంబయ్య మరియు ఏఈలు, మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS