గోదావరిఖని యువత ప్రతిభకు మరో నిదర్శనం.. కొత్త సినిమా ఘన విజయం సాధించాలి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: హైదరాబాద్,
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన కొత్త సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, గోదావరిఖని మట్టి బిడ్డలు ఎంతో కష్టపడి రూపొందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించే ఇటువంటి ప్రయత్నాలు మరింత ముందుకు సాగాలని, యువ సినీ కళాకారులు తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.
రామగుండం, గోదావరిఖని ప్రాంతానికి చెందిన యువత సినిమా రంగంలో తమ సత్తా చాటుకోవడం అభినందనీయమని పేర్కొన్న ఆయన, ఈ చిత్రబృందం భవిష్యత్తులో మరిన్ని నాణ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నటుడు సాగర్, చిత్ర యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
