కాంగ్రెస్ వైపు పెరుగుతున్న ఆకర్షణ…
బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన ఇద్దరు సర్పంచులు…
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే మద్దతుగా కాంగ్రెస్‌లో చేరికలు…
— ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:సుల్తానాబాద్: జూలై-08:
సుల్తానాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు గ్రామ సర్పంచులు, పలువురు వార్డు సభ్యులు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కదంబాపూర్ గ్రామ సర్పంచ్ కర్రె గట్టయ్య, కనుకుల గ్రామ సర్పంచ్ కర్రె కవిత కుమార్‌తో పాటు పలువురు వార్డు సభ్యులు, స్థానిక నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ, రూ.100 కోట్ల వ్యయంతో గర్రెపల్లి–కదంబాపూర్–కనుకుల మీదుగా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు నిర్మించనున్న తారు రహదారి సహా పలు అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విశ్వాసంతో సర్పంచులు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు.
చేరిన ప్రజాప్రతినిధుల సేవలను గ్రామాల సమగ్ర అభివృద్ధికి వినియోగించుకుంటూ ప్రజలకు మరింత చేరువయ్యేలా పనిచేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు ప్రజల ఆశీర్వాదం లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. దామోదర్‌రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుక సతీష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నామని రాజిరెడ్డి, పలువురు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
