గాజులరామారం సర్కిల్ పరిధిలోని భవాని నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసుకున్న ఫంక్షన్ లో ఫుడ్ పాయిజన్ అయ్యి తీవ్ర అస్వస్థత కు గురై సూరారం నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న భవాని నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని, అస్వస్థకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
హాస్పిటల్లో అస్వస్థతకు గురైన వారి కుటుంబ సభ్యులకు,బంధువులకు అధైర్య పడవద్దు అని, త్వరలోనే కోలుకుంటారని ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ తో పాటు ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, సాయినాథ్ నేత తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
