48వ. డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన…..
– సాక్షిత : స్థానిక సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు…
గుడ్ మార్నింగ్ రామగుండం…
రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి 99 రోజుల ప్రజా పాలన – పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉదయం 6 గంటలకు 48వ.డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల సమస్యలను పరిశీలించి, వీటిని అత్యవసరంగా పరిష్కరించాలని, సంబంధిత అధికార యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
అదేవిధంగా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఈ పర్యటన నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్పొరేటర్ రేణుకుంట్ల నిర్మలాదేవి, 47వ. డివిజన్ కార్పొరేటర్ దాసరి సాంబామూర్తి, కాంగ్రెస్ నాయకులు ఉపేందర్, సాయి, రవి, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, మెప్మా ఆర్పీలు, డివిజన్ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY