ప్రజలు పిర్యాదులు ఇచ్చి అలసిపోవాలి,

Sakshitha news

ప్రజలు పిర్యాదులు ఇచ్చి అలసిపోవాలి,
కానీ అధికారులు సమస్యలను పరిష్కరించరు.

మున్సిపల్ అధికారుల ఘోరమైనా నిర్లక్ష్యం.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

      గత నెల రోజులుగా కురిసిన వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిని గుంతలు ఏర్పడ్డయని గత వారం ప్రజవానిలో పిర్యాదు చేస్తే నేటికీ వారం రోజులు అయిపోయినప్పటికి ఇంత వరకు కనీసం ఒక గుంతను కూడా పుడ్చకపోవడం అధికారుల నిర్లక్ష్యం కండ్లకు కనిపిస్తుందని, అసలు డిప్యూటీ కమీషనర్ అటు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుండా ఏమి పనిచేస్తున్నారో తెలియట్లేదని, డిప్యూటీ కమీషనర్ ప్రజావానిలో ఒక్కరే కనిపిస్తారు కానీ ఇతర అధికారులు తమకు లెక్కేలేదని ఉన్నట్లు కనిపిస్తున్నదని,ఇప్పటికైన డిప్యూటీ కమీషనర్ సమస్యలు పరిష్కరించకపోతే బుధవారం నాడు వచ్చి కొబ్బరికాయలు కొట్టి నిరసన చేస్తామని హెచ్చరించారు.