SAKSHITHA NEWS

// కాంగ్రెస్ ప్రెస్ నోట్ //

ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు ‘జన’ నీరాజనం…!

ఏ గ్రామం వెళ్లినా అపూర్వ ఆదరణ

వీరయ్యకు బ్రహ్మరథం పడుతున్న స్థానికులు

కాంగ్రెస్ తోనే మేమంతా అంటున్న నియోజకవర్గ ప్రజలు

ప్రచారంలో దూసుకుపోతున్న పొదెం భద్రాచలం : భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన పొదెం వీరయ్యకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలో ఎమ్మెల్యే వీరయ్య ఎన్నికల ప్రచారం గావించారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్లినా వీరయ్యకు అపూర్వ ఆదరణ కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహించిన వీరయ్య ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ అన్ని మండలాలు, గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ ప్రజలను కలుస్తున్నారు. ఎక్కడికి అక్కడ మండల, గ్రామ కాంగ్రెస్ నాయకత్వం చురుకుగా పని చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నియోజకవర్గ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంతోంది. నిజాయితీపరుడు, మూడు రంగుల జెండా అనే అంటిపెట్టుకొని చివరి వరకు కొనసాగిన మంచి చరిత్ర వీరయ్యకు ఉండటంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.ఈసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇక్కడ గెలిచేది పొదెం వీరయ్య అనే ధీమాతో స్థానికులు ఉన్నారు. కరోనా సమయంలో వీరయ్య ఈ ప్రాంతానికి చేసిన సేవ కూడా ప్రజలు గుర్తు చేస్తున్నారు.

వరదల సందర్భంలో కూడా వరద సహాయం ప్రభుత్వం నుంచి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు అందేలా వీరయ్య చేసిన కృషిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. సుందర భద్రాద్రి ప్రగతిని సీఎం కేసీఆర్ చేపట్టకపోవడం, అసలు రామయ్య గుడినే కెసిఆర్,కేటీఆర్ దర్శించకపోవడం భద్రాచల పుణ్యక్షేత్రంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై పొదెం పలుమార్లు లేవనెత్తటం, భద్రాద్రి రామయ్య పై పొదెం కున్న భక్తిని కూడా స్థానికులు వీరయ్యను ఎంతగానో విశ్వసిస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే వీరయ్యను టార్గెట్ చేయడం, నిధులు ఇవ్వకపోవడం స్థానికుల్లో మొదటి నుంచి ఈ అంశమే చర్చ జరుగుతుంది. అందుకే ఈసారి దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్, భద్రాచలం నియోజకవర్గం లో కాంగ్రెస్ గెలవటం ఖాయమని స్థానిక ప్రజలు ఘంటాపదంగా నొక్కి వక్కానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈసారి తప్పకుండా వీరయ్యను గెలిపించుకోవడం ద్వారా భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి వేగిరమవుతుందని స్థానికుల అభిప్రాయపడుతున్నారు. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం,వాజేడు మండలాల్లో ప్రతి చోట వీరయ్య గెలిపే సాధ్యమన్న ప్రచారం హోరెత్తుతోంది. ఏ నోట విన్నా ఇదే మాట స్పష్టమవుతోంది. దీంతో ఇక వీరయ్య గెలుపు నల్లేరుపై నడికేనని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం 13 రోజుల్లోనే వీరయ్య గెలుపు సాధ్యమైందని, ఈసారి గతం కంటే డబల్ రెట్ల మెజారిటీ వీరయ్యకు వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. రోజురోజుకు వీరయ్యకు అన్ని వర్గాల నుంచి మద్దతు కూడా పెరుగుతోంది. పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. భద్రాచలం నియోజకవర్గం లో కాంగ్రెస్ తిరుగులేని రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది.

Whatsapp Image 2023 11 24 At 6.12.39 Pm

SAKSHITHA NEWS