విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాగరాజు ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ అమ్మవారిని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు..
అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఎమ్మెల్యే నాగరాజు ని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ దర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట 1989 ఎస్సై బ్యాచ్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, డాక్టర్ సురేష్ బాబు తో పాటు ఇతరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు…
తదనంతరం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు మరియు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమానికి బయలుదేరారు….

