కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ పథకాలను కాపాడాలని కుత్బుల్లాపూర్ లో బీఆర్‌ఎస్ భారీ నిరసన
కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ పథకాల విషయంలో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా, పేద మరియు అర్హులైన కుటుంబాలకు అండగా నిలిచే ఈ సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్‌ఎస్ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద్ సూచనలతో జరిగిన ఈ నిరసనలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ , రాజ్ కుమార్ ముదిరాజ్, తారా సింగ్, వేణు ముదిరాజ్, కిషోర్ ముదిరాజ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడపిల్లల ఆత్మగౌరవానికి చిహ్నం. వాటిని రద్దు చేయడానికి చేస్తున్న కుట్రను ప్రజలు సహించరని” హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


