- బెక్కెం గ్రామానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలుపు కోసం పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.
గ్రామ అభివృద్దే తన లక్ష్యం అభ్యర్థి తూర్పుంటి పుష్పవతి స్పషీకరణ
సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లోని బెక్కిం గ్రామ
సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ బలపరిచిన పార్టీ అభ్యర్థి పుష్పావతి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారాల్లో పాల్గొని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలను కోరారుఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థినిసర్పంచ్ గా గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి పుష్పావతికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అని తెలిపారు.
ప్రజల ఓటు గ్రామ భవిష్యత్తుకు బలమైన పునాది లాంటిది అని అన్నారు. సర్పంచ్ అభ్యర్థి తూర్పింటి పుష్పవతి కురుమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ అండతో మంత్రి జూపల్లి సహకారంతో బెక్కెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తన గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
